FbTelugu

సెప్టెంబర్ లో వృత్తి విద్యాసంస్థలు ప్రారంభం : ఏఐసీటీఈ

న్యూఢిల్లీ: సెప్టెంబరు 15 నుంచి దేశవ్యాప్తంగా వృత్తి విద్య, సాంకేతిక విద్యాసంస్థల కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమవనుందని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) తెలిపింది.

దేశంలో తీవ్రంగా వ్యాపిస్తున్న కరోనా నేపథ్యంలో మార్పు చేర్పులతో కొత్త అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ఫస్టియర్ లో కొత్తగా చేరే విద్యార్థులకు సెప్టెంబరు 15 నుంచి, మిగతా విద్యార్థులకు ఆగస్టు 16 నుంచి తరగతులు ప్రారంభించాలని సూచించింది. సెప్టెంబర్‌ 10లోగా రెండోదశ కౌన్సెలింగ్‌ పూర్తి చేయాలని తెలిపింది.

You might also like