FbTelugu

‘వైజాగ్ నేవీ మారథాన్’..తీరంలో పోటెత్తిన జనసంద్రం

విశాఖపట్నం: ప్రతి ఏటా నావికా దళం నిర్వహించే ‘వైజాగ్ నేవీ మారథాన్’ పోటీలను ఈ రోజు తెల్లవారు జామున నేవీకి చెందిన ఐఎన్ఎస్ కళింగ ప్రధానాధికారి కమాండర్ రాజేష్ దేవనాథ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రంమంలో ఔత్సాహికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ పోటీలు నాలుగున్నర గంటలకే మొదలయ్యాయి. ఈ 42 కిలో మీటర్ల ఫుల్ మారథాన్ పోటీలు బీచ్ రోడ్డులోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వద్ద ప్రారంభమైన ఫుల్ మారథాన్ చిప్పాడ గ్రామం (హోటల్ ప్యారడైజ్) వరకు వెళ్లి తిరిగి ఫంక్షన్ హాల్ వద్దకు తిరిగి చేరడంతో ముగుస్తుందని తెలిపారు.

You might also like