FbTelugu

విచారణకు వివేక్ భార్య డుమ్మా

బెంగళూరు: డ్రగ్స్ కేసులో సమన్లు అందుకున్న బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ భార్య ప్రియాంక అల్వా విచారణకు గైర్హాజరు అయ్యారు. మరోసారి ఆమెను విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపిస్తామని సీసీబీ అధికారులు వెల్లడించారు.

డ్రగ్ మాఫియాతో సంబంధాలు ఉన్నట్లు తేలడంతో ప్రియాంకతో పాటు ఆమె సోదరుడు ఆదిత్య అల్వా కు నోటీసులు పంపించారు. ఆదిత్య అల్వా కోసం ముంబైలోని వివేక్ నివాసంలో సీసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే ఆదిత్య అల్వా ముంబైలోనే ఉన్నట్లు భావిస్తున్నామని, ఈకేసులో అతని బంధువులను పిలిపించి విచారిస్తామన్నారు. దాదాపు నెల రోజులుగా ఆయన కోసం వేట సాగిస్తున్నామన్నారు. ఆదిత్యకు చెందిన హౌస్ ఆఫ్ లైఫ్ రిసార్టులో డ్రగ్స్ పార్టీలు జరిగినట్లు పోలీసుల విచారణలో వెల్లడైన విషయం తెలిసిందే.

You might also like

Leave A Reply

Your email address will not be published.