FbTelugu

నేడు హైదరాబాద్ కు 80 దేశాల ప్రతినిధులు

* భారత్ బయోటెక్ కంపెనీ సందర్శన

హైదరాబాద్: కోవిడ్ వ్యాక్సిన్ పై జరుగుతున్న పరిశోధనల పరిశీలన నేపథ్యంలో.. ఇవాళ సుమారు 80 దేశాలకు చెందిన హైకమిషనర్లు, రాయబారులు తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలోని భారత్ బయోటెక్ కంపెనీని సందర్శించనున్నారు.

మానవులపై భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ ప్రయోగం ఇప్పటికే 2 దశలు పూర్తి చేసుకోగా.. చివరి దశ క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఈ పరిశోధనలను విదేశీయులకు తెలియజేసే ఉద్దేశంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ మధ్యాహ్నానికి హైదరాబాద్ చేరుకోనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.