FbTelugu

సర్పంచి పదవికి అన్ని కోట్లా!?

ముంబై: భూముల వేలం విన్నాము కాని సర్పంచి పదవికి వేలం పాట ఇంత వరకు వినలేదు. మహారాష్ట్రలోని నాసిక్ జిల్లా ఉమ్రానే గ్రామంలో సర్పంచి పదవికి కోట్లాది రూపాయలు వెచ్చించారో ఒక వ్యక్తి.

గ్రామస్థులు సర్పంచి పదవి కోసం వేలం పాట నిర్వహించారు. ఈ వేలంలో పాల్గొన్న విశ్వాస్ రావు దేవరా అనే వ్యక్తి రూ.2.5 కోట్లకు పాట పడి పదవి దక్కించుకున్నారు. తొలుత రూ.1.11 కోట్లతో వేలం పాట ప్రారంభమై రూ.2.5 కోట్ల వద్ద ఆగిపోయింది. చివరగా దేవరా పాడిన మొత్తానికి గ్రామస్థులు ఆమోదం తెలిపి ఆయన సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ సొమ్ముతో గ్రామంలో రామేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించుకుంటామని గ్రామస్థులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.