FbTelugu

ఏపిలో ఆక్సిజన్ పై చేతులెత్తేసిన విశాఖ స్టీల్

అమరావతి: ఏపిలోని పలు ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. గతేడాది ప్రత్యేకంగా  కరోనా ఆసుపత్రులకు 120 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఈసారి చేతులెత్తేసింది. లాక్‍డౌన్, ప్రైవేటీకరణ మూలంగా ఆ స్థాయిలో చేయలేమని తేల్చి చెప్పింది.

ఈసారి వంద టన్నులకు మించి ఆక్సిజన్ ఇవ్వలేమని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. సెకండ్ వేవ్ లోఆక్సిజన్‍కు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ఆక్సిజన్ కొరత ఏర్పడుతుందని ముందే గ్రహించిన విశాఖపట్నం కేజీహెచ్ తన ఆవరణలో 13, 20 టన్నుల భారీ ఆక్సిజన్ ట్యాంకర్ల ఏర్పాటు చేసింది. విజయవాడ ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ కొరత ఏర్పడ్డంతో ఏజెన్సీలు డిమాండ్‍కు తగ్గస్థాయిలో సఫ్లై చేయలేకపోతున్నాయి. ప్రస్తుతం 50 మంది కరోనా రోగులకు డిమాండ్ ఉంటే 20 మందికి మాత్రమే సఫ్లై చేస్తున్నారు. కరోనా, ఇతర వ్యాధులు, హోం ఐసోలేషన్ పేషెంట్ల నుంచి ఆక్సిజన్‍కు డిమాండ్ ఏర్పడింది. ఆక్సిజన్‍కు డిమాండ్ పెరగడంతో ధర పెంచడంతో పాటు రీ ఫిల్లింగ్‍కు ఎక్కువ వసూల్ చేస్తున్నారు. ఐదు లీటర్లకు రూ.15 వేలు, పది లీటర్లకు రూ.20 వేలు చొప్పున ఏజెన్సీలు వసూలు చేస్తున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.