FbTelugu

విశాఖ స్టీల్ వందశాతం ప్రైవేటు: కేంద్రం

న్యూఢిల్లీ: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను వందశాతం ప్రైవేటీకరణ చేస్తామని, ఇందులో ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని కేంద్ర మంత్రి భగవత్ కిషన్ రావు కరాడ్ స్పష్టం చేశారు.
నష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా చెప్పారు.

ప్రైవేటీకరణపై టిడిపి సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ రాజ్యసభలో ప్రశ్న వేయగా, దానికి కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. స్టీలు ప్లాంట్ ను విక్రయించవద్దని ఏపి వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. మొన్న బడ్జెట్ సమావేశాల్లో, ఆ తరువాత కూడా విక్రయంపై కేంద్రం స్పష్టంగా ప్రకటనలు చేస్తూ వస్తున్నది. అయినా ఉద్యోగులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా నిరసనలు కొనసాగిస్తూ ప్రజా మద్దతు కూడాగట్టే ప్రయత్నం చేస్తున్నారు.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.