FbTelugu

‘లక్షణాలున్న వారితోనే వైరస్ వ్యాప్తి’

న్యూఢిల్లీ: యావత్ ప్రపంచ దేశాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి వ్యాప్తిపై శాస్త్రవేత్తలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. లండన్‌కు చెందిన ఇంపీరియల్‌ కాలేజీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో పలు విషయాలు గుర్తించినట్టు తెలిపారు.

కరోనా సోకి లక్షణాలు ఉన్నావారి నుంచే వైరస్ ఇతరులకు ఎక్కువగా వ్యాపిస్తుందని.. కరోనా బాధితులైనప్పటికీ ఏ లక్షణాలు లేని వారినుంచి వైరస్ వ్యాప్తి చాలా తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. కరోనా బాధితుల నుంచి వైరస్ మొదట కుటుంబ సభ్యులకు సోకే ప్రమాదం ఉందని తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.