FbTelugu

కరెన్సీ నోట్లతో వైరస్‌ వ్యాప్తి’

కరెన్సీ నోట్లతోనే కరోనా వైరస్‌ వేగంగా వ్యాపించే అవకాశాలున్నాయని ఎస్‌బీఐ చేసిన ఓ పరిశోధనలో వెల్లడైంది. ఈ మేరకు ఆస్ట్రేలియా, యూకే, కెనడా తరహాలో కాగితపు కరెన్సీ నోట్లకు బదులుగా పాలీమర్నో నోట్లను తీసుకొచ్చే అవకాశాన్ని పరిశీలించాలని రీసెర్చ్ బృందం ప్రభుత్వాన్ని కోరింది. వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌ను నియంత్రించాలంటే కరెన్సీ నోట్ల విషయంలో వీలైనంత త్వరగా ఓ నిర్ణయం తీసుకోవడం మేలని పేర్కొంది.

అయితే, కరెన్సీకి బదులుగా డిజిటల్ లావాదేవీలు చేస్తే ఇంకా మంచిది. కానీ భారత్‌లాంటి దేశంలో ఒక్కసారిగా నగదు లావాదేవీలను నియంత్రించడం అంతసులభం కాదు. కాబట్టి కాగితపు నోట్లకు ప్రత్యామ్నాయం చూడాల్సిన అవసరం ఉందని తెలిపింది. కరెన్సీ నోట్లపై మనుషులకు ఇన్‌ఫెక్షన్లు కలిగించే సూక్ష్మజీవులు ఉంటున్నట్లు, వాటి ద్వారా పలు వ్యాధులు వస్తున్నట్లు పరిశోధన బృందం  పలు నివేదికలను సైతం ఉదహరించింది.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More