FbTelugu

వైరస్ విజృంభిస్తుంటే లాక్ డౌన్ సడలింపులు

కేంద్రంపై విరుచుకుపడిన రాహుల్

ఢిల్లీ: లాక్ డౌన్ ఎగ్జిట్ లో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. వైరస్ విజృంభిస్తుంటే లాక్ డౌన్ సడలింపులు ఇచ్చిన దేశం భారత్ ఒక్కటేనన్నారు.

దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయన్నారు. లాక్ డౌన్ వైఫల్యం ఫలితాలను ఇప్పుడు దేశం అనుభవిస్తుందన్నారు. లాక్ డౌన్ అమలు చేయడం కేంద్రం విఫలమైందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు కేంద్రం సాయం చేయడం లేదు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు అధిక నిధులిస్తున్నారన్నారు. లాక్ డౌన్ ఉద్దేశ్యం, లక్ష్యం నెరవేరలేదన్నారు.

వలస కూలీల విషయం కేంద్రం ఏం చేసిందన్నారు. ఇప్పటి వరకు వారికి ఏలాంటి భరోసా ఇవ్వలేదన్నారు. వలస కూలీలు వేల కిలోమీటర్లు తమ గమ్యస్థానాలకు చేరుకున్నారని, వారికి ఆసరా కల్పించడంలో కేంద్రం సరిగా వ్యవహరించలేదని రాహుల్ విమర్శించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.