FbTelugu

బ్రిటన్ కు వైరస్ పెను ప్రమాదం

లండన్: బ్రిటన్ దేశం చిగురుటాకులా వణుకుతున్నది. వారానికి ఇరవై లక్షల మంది చొప్పున వ్యాక్సిన్లు వేయకపోతే మహమ్మారి వ్యాప్తి మూడో దశకు చేరడాన్ని ఆపడం ఎవరితరం కాదని ఒక అధ్యయనం వెల్లడించింది.
మున్ముందు దారుణంగా ఉంటాయని తేల్చింది. 2020 తో పోల్చితే 2021లో కేసులు ఎక్కువగా నమోదు అవుతాయని హెచ్చరించింది. సుమారు 6.66 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఇప్పటి వరకు 23 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 71వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

విద్యాసంస్థలు తెరవకుండా, కఠిన నిబంధనలు అమలు చేసి వ్యాక్సిన్ చేస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాదని పరిశోధకులు చెబుతున్నారు.
ఇలాగే ఉంటే కొత్తగా వెలుగు చూసిన స్ట్రెయిన్ వైరస్ 70 అధికంగా వ్యాపిస్తుందని అంటున్నారు. వేగంగా దాడి చేస్తున్న ఈ వైరస్ అత్యంత ప్రమాదకరని ఆరోగ్య నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే పలుదేశాలు విమానాల రాకపోకలు నిషేధించాయి. బ్రిటన్ లో ఈ నెల 8వ తేదీ నుంచి ఫైజర్ వ్యాక్సిన్ ఇవ్వడం ప్రారంభించారు. ఇప్పటి వరకు 6 లక్షల మందికి తొలి డోస్ ఇచ్చారు. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ జనవరి నుంచి ఇచ్చే సూచనలు కన్పిస్తున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.