FbTelugu

రోజూ 3 లక్షల కేసులు రావచ్చు…

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ ఉప్పెనలా మారి విశ్వరూపం దాల్చింది. మే నెలాఖరు వరకు ఇదే తీరుగా ఉంటుందని, ప్రతి రోజు 3 లక్షల పాజిటివ్ కేసులు నమోదు కావచ్చని వైరస్ నిపుణులు షాహిద్ జమీల్ హెచ్చరిస్తున్నారు.

గత 24 గంటల్లో 1,84,372 కేసులు నమోదు కాగా, మృతుల సంఖ్య ఒక వేయి దాటింది. ఇదే కొనసాగితే పరిస్థితి ఊహించలేని విధంగా దిగజారడం ఖాయమంటున్నారు. ప్రపంచంలో అమెరికా తరువాత ఈ స్థాయిలో ఒక్కరోజులోనే 1.84 లక్షల కేసులు నమోదు అయిన దేశం భారతదేశమే. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభించిన సమయంలో కరోనా అంతగా లేకపోవడం ప్రజలు కూడా వ్యాక్సిన్ వృధా అనే అభిప్రాయానికి వచ్చారు. కరోనానే లేదు వ్యాక్సిన్ ఎందుకునే నిర్లక్ష్యం ప్రదర్శించారని జమీల్ వ్యాఖ్యానించారు. ఈ నిర్లక్ష్యమే పలువురికి శాపంగా మారిందనేది ఆయన చెప్పుకొచ్చారు.

దేశంలో వ్యాక్సిన్ల కొరత అంతగా లేదని, రెండు కంపెనీలు ఇప్పటి వరకు 32 కోట్ల వ్యాక్సిన్ డోసులు తయారు చేశాయన్నారు. ఇందులో 12 కోట్లు మాత్రమే రాష్ట్రాలకు పంపించారని, మరో ఆరు కోట్ల వరకు విదేశాలకు ఎగుమతి అయ్యాయన్నారు. మరో 12 నుంచి 14 కోట్ల డోసుల వరకు కంపెనీల వద్ద ఉన్నాయని జమీల్ లెక్కలు వేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.