FbTelugu

‘వైరల్ అవుతున్న ఎమ్మెల్యే ఆడియో ఫేక్’

నల్లగొండ : నాగార్జున సాగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నరసింహయ్య రెండ్రోజుల క్రితం మృతి చెందగా.. ఆయన చివరి క్షణాల వాయిస్ అంటూ ఓ ఆడియో.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వాయిస్ అచ్చం నోముల నరసింహయ్య వాయిస్ లాగే ఉండడంతో అందరూ నమ్మేశారు కూడా.. సీపీఎం కార్యకర్తలను ఉద్దేశించి ‘ఉమ్మడి నల్లగొండ జిల్లా సీపీఎం బిడ్డలు.. పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి కంకణబద్ధులైన కామ్రేడ్‌ కళాకార సోదరులారా.. మీఅందరికీ విప్లవ, కళాభివందనాలు.

అంటూ ఒక ఆడియో.. ఏదిఏమైనా మీరంతా కమ్యూనిస్టు బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ సెలవు అంటూ మరో ఆడియో బయటకు వచ్చింది. అయితే ఈ ఆడియోపై నరసింహయ్య కుమారుడు స్పందించారు. అది తన తండ్రి వాయిస్ కాదని స్పష్టం చేస్తూ.. ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా.. సీపీఎం ప్రజానాట్య మండలికి చెందిన మిమిక్రీ ఆర్టిస్టు ఏడుకొండలు స్పందించారు. తానే నోముల నరసింహయ్య గారిపై ఉన్న అభిమానంతో అలా చేశానని.. వేరే ఉద్దేశంతో కాదంటూ క్షమాపణలు కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.