FbTelugu

కన్పిస్తే కాల్చివేత ఆదేశాలిస్తాం: కేసీఆర్

హైదరాబాద్: ప్రజాస్వామ్య దేశం కాబట్టి సున్నితంగా చెప్తున్నాం… మాట వినకపోతే కఠినంగా వ్యవహరించక తప్పదని సీఎం కేసీఆర్ హెచ్చరించారు.

రాష్ట్రాన్ని రక్షించుకునే దిశ లో ఏ నిర్ణయం అయినా తీసుకునే పరిస్థితి వస్తదని స్పష్టం చేశారు. మాట వినకపోతే 24 గంటల కర్ఫ్యూ తప్పదు. అదీ కూడా వినకపోతే షూట్ అండ్ సైట్ ఆర్డర్ ఇస్తాం… ఆర్మీ ని రంగంలోకి దింపడం తప్పదన్నారు. కొన్ని గ్రామ పంచాయతీలలో కంచెలు అడ్డు కట్టగా పెట్టడం మంచి పరిణామం అని అన్నారు. అలాగే అందరూ స్వీయ నిర్బంధంలో ఉండక తప్పదన్నారు.

జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం కేసీఆర్ ఆదేశాలు :

విదేశాల నుండి వచ్చిన ప్రతి ఒక్కరి సమాచారం ఇవ్వాలిసిందిగా ప్రజలకు, ప్రజా ప్రతినిధులకు తెలియ చేయండన్నారు. ఏ గ్రామంలో  పండే వ్యవసాయ ఉత్పత్తులు అక్కడే కొనేలా సరిపడా కేంద్రాలను పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో టౌన్ లో ఉండే మార్కెట్ కు రావద్దు.

సాటి మనుషులకు.. సమాజానికి ఇబ్బందులు వచ్చేలా ప్రవర్తిస్తే…వారి కి ఉన్న అన్నీ లైసెన్సు లు రద్దు చేయబడతాయి. హోమ్ క్వరంటైన్ లో ఉన్నవారి పాస్ పోర్టులు జిల్లా  కలెక్టరేట్ లో పెట్టుకోండి.

ఇప్పటి వరకు దేశం లో 40 మంది చనిపోయారు… అదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఎవరిని వెంటిలేటర్ ల మీద పెట్టాలిసిన క్రిటికల్ పరిస్థితి లేదు. విదేశాల నుండి సంక్రమించిన  వారిలో 32 మంది కి వైరస్ అంటుకుంది. ఎప్పటి వరకు ఉంటుంది.. ఎవరికి ఏ విధంగా అంటుతాదో తెలియని పరిస్థితి ఉందని సీఎం అన్నారు.

విదేశాల నుండి వచ్చిన  జబ్బు పడిన వారిని హోమ్ క్వరంటాయిన్ లో పెట్టండి. కరోనా లక్షణాలు గల  అనుమానితులను హైదరాబాద్ లో పరీక్షించి, పాజిటివ్ వస్తే ఇక్కడే చికిత్స అందించాలి.

రష్యాలో స్ట్రిక్ట్ గా, హై రిస్క్ తీసుకున్నారు కాబట్టి.. ఒక్క కేసు పాజిటివ్ లేదు. అగ్రరాజ్యం,  అత్యంత శక్తి వంతమైన అమెరికాలోనే 50 వేల మంది కరోనా బారిన పడ్డారు. కరోనా వైరస్  తగిలిచుకుంటే తప్ప… దాన్ని అంతటా వచ్చే వ్యాధి కాదు. గుంపులుగా ఉండకుండా చూడండి… జిల్లా యంత్రాంగం చాలా స్ట్రిక్ట్ గా ఉండండి. రాత్రి 7 గంటల నుండి ఉదయం 6  వరకు ఏ ఒక్క వ్యక్తి కూడా బయటకి రావద్దు… అన్నీ నిత్యావసర సరుకుల దుకాణాలు సాయంత్రం 6 గంటల వరకు మూసి వెయ్యాలి. మాట వినకపోతే సీజ్ చేసి మూసి వేయండన్నారు.

రాష్ట్రాన్ని కాపాడుకునే క్రమంలో.. పౌర బాధ్యతను పాటించాలి… ఎవ్వరికీ మినహాయింపు లేదు. మన రాష్ట్ర భవిష్యత్ దృష్ట్యా కొన్ని కఠినమైన నిబంధనలను పాటించక తప్పదు… ప్రైవేటు కార్మికులకు ఈ నెల మొత్తం వేతనం ఇవ్వాలిసిందిగా కలెక్టర్ లు ఆదేశాలు ఇవ్వండి. వ్యవసాయ శాఖ కు సంబంధించిన పనులకు అంతరాయం కలిగించొద్దు. జనం గుంపు గుంపులుగా ఉండొద్దు అంతే..ఎమర్జెన్సీ అవసరాల పట్ల పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించండి.

నిత్యావసర వస్తువులు కొన్ని అటు పోవడం… మనకు రావడం… జరుగుతాయి. ఆ విషయం లో కాస్త జాగ్రత్తగా ఉండండి. శానిటేషన్ రెగులర్ గా జరగాలి. గ్రామ,పట్టణ పరిశ్యుద్ధం బాగా ఉండాలి. ప్రతి రోజు ప్రతి ఊరు శుభ్రంగా ఉండాలి. మీ జిల్లా హోమ్ క్వారంటైన్ లో ఉన్న వారి లిస్ట్ ఎప్పుడు దగ్గర పెట్టుకోవాలి… స్ట్రిక్ట్ గా వాచ్ ఉండాలి. వారి మూమెంట్ తెలుసుకోండి.. బయటకు పోకుండా చూడండి.

జిల్లా కలెక్టర్ లు  జిల్లాలోని అన్నీ ఆసుపత్రులను విజిట్ చేయండి.. ముందస్తు గా రెడీగా  పెట్టుకోండి.. ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే రిపేర్ చేయించండి. పోలీస్ వారు మీ మీ సిబ్బంది సంఖ్య ని బట్టి డ్యూటీ లు వేయండి. సామాజిక స్పృహ ఉన్నవారిని కంట్రోల్ రూమ్ లో పెట్టండి.. ప్రజలతో మంచిగ మాట్లాడాలి.

బయట నుండి వైరస్ వచ్చే ప్రమాదం లేదు గాని.. ఇప్పటి వరకు చొచ్చుకుపోయిన వైరస్ ని నివరించడమే లక్ష్యం. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతుంది.. అయినప్పటికీ ప్రజల ఆరోగ్యం ముఖ్యం అని..ప్రభుత్వం ముందుకు పోతోంది. నిర్లక్ష్యం చేస్తే పెద్ద ప్రమాదం లో పడతము అని సీఎం హెచ్చరించారు.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More