FbTelugu

కరోనా మృతదేహం… తరిమికొట్టిన గ్రామస్థులు

భువనేశ్వర్: కరోనా పాజిటివ్ తో మృతిచెందినవారిపై ఇంకా గ్రామాల్లో మూఢనమ్మకాలు పోలేదు. మృతదేహం ద్వారా గ్రామంలో వైరస్ వ్యాపిస్తుందనే భయం వెంటాడుతోంది. మూఢనమ్మకాల కారణంగానే ఇప్పటికి కొన్ని గ్రామాల్లో వారి మృతదేహాల దహనాన్ని అడ్డుకుంటున్నారు.

మయూరభంజ్ జిల్లా సోనారిపోసి గ్రామంలో కరోనా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు, పోలీసులు, వైద్య సిబ్బంది రాగా గ్రామస్థులు అడుకున్నారు. విన్పించుకోకపోవడంతో వెంటపడి రాళ్లు, కర్రలతో కొట్టారు. సోనిరిపోసి గ్రామస్థుడు వైద్య పరీక్షల కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు. పాజిటివ్ గా తేలడంతో అతనికి చికిత్స అందిస్తుండగానే చనిపోయాడు. అతని స్వగ్రామంలో అంత్యక్రియలు జరిపేందుకు అంబూలెన్స్ లో మృతదేహం తీసుకువెళ్లారు. ముందు జాగ్రత్త చర్యలు పోలీసులు కూడా గ్రామానికి చేరుకుని దహనానికి ఏర్పాట్లు చేశారు. ఈలోపు గ్రామస్థులు అక్కడికి చేరుకుని అడ్డుచెప్పగా విన్పించుకోకపోవడంతో కర్రలు, రాళ్లతో వెంటపడి కొట్టారు. అక్కడి నుంచి తప్పించుకున్న పోలీసులు, అధికారులు పోలీసు స్టేషన్ కు వెళ్లి తిరిగి వచ్చారు. అదనపు సిబ్బందితో వచ్చి దాడికి పాల్పడిన ఏడుగురిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.