FbTelugu

వ్యాక్సిన్ సిబ్బందిని తరిమి కొట్టిన గ్రామస్థులు

భోపాల్: ఉత్తర ప్రదేశ్ లో సరయూ నది ఘటన మరువక ముందే మధ్యప్రదేశ్ లో మరో ఘటన ఇవాళ జరిగింది. కరోనా వ్యాక్సిన్ పై ఇంకా ప్రజల్లో అనుమానాలు తొలగలేదు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను ఇంకా జనం నమ్మేస్తున్నారనడానికి ఇదొక ఉదాహరణ.

వ్యాక్సిన్ కోసం వచ్చిన సిబ్బందిని చూసి ఉత్తరప్రదేశ్ లోని ఒక గ్రామం వారు సమీపంలోని సరయు నది వద్దకు వెళ్లి దూకేశారు. వేలాది మంది ఆ గ్రామంలో ఉండగా కేవలం 14 మంది మాత్రమే వ్యాక్సిన్ వేసుకున్నారు. ఇక చేసేది లేక ఆరోగ్య సిబ్బంది వచ్చిన దారిన తిరిగి వెళ్లారు. ఈ ఘటన నిన్న చోటు చేసుకోగా తాజాగా మధ్యప్రదేశ్ లో అదే ఘటన చోటుచేసుకున్నది.

ఉజ్జయిని జిల్లా మెయిల్ ఖేడీ గ్రామానికి వైద్య సిబ్బంది చేరుకున్నారు. వాక్సిన్ పై అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు వారిపై రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఏం జరుగుతుందో తెలియని వైద్యులు, వైద్య సిబ్బంది కొద్ది సేపు టెన్షన్ కు గురయ్యారు. తమను కొట్టేందుకు వస్తున్నారని గమనించి తలోదారిన పరుగులు తీశారు. ఎవరి దారిన వారు పరుగులు తీయడంతో గ్రామస్థులు శాంతించారు. దాడి నుంచి బయటపడిన సిబ్బంది తమ వాహనాల్లో జిల్లా కేంద్రానికి వెళ్లిపోయారు. ఈ ఘటనలో పంచాయతీ సెక్రెటరీ, నర్సులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం తెలియడంతో పోలీసులు హుటాహుటిన గ్రామానికి చేరుకుని ప్రజలను చెదరగొట్టారు. అల్లర్లు జరక్కుండా ఉండేందుకు పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.