అమరావతి: దేశ భద్రత విషయంలో ప్రధాని మోదీ తీసుకునే నిర్ణయాలపై తాము కట్టుబడి ఉంటామని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. భారత్-చైనా సరిహద్దులో తాజా పరిణామాల నేపథ్యంలో ఆయన ట్విట్టర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు. జాతీయ భద్రతకు సంబంధించిన సమస్యలను రాజకీయం చేయడానికి ఎవరూ ప్రయత్నించకూడదని అన్నారు. మన భద్రతాదళాలకు, కేంద్ర ప్రభుత్వంతో కలిసి మనమంతా నిలబడదాం అంటూ ట్వీట్ చేశారు.జాతీయ భద్రతపై రాజకీయాలొద్దు: విజయసాయి రెడ్డి
No one should try to politicize issues related to National Security. We all stand with our security forces and the central government. I am sure that our Army will give a befitting reply to intruders. We will standby the decisions taken by our Hon'ble PM @PMOIndia .
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 18, 2020