FbTelugu

ఒకే నోటిఫికేషన్ తో 10 వేల వైద్యపోస్టుల భర్తీ: విజయసాయి

అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకే నోటిఫికేషన్ తో దాదాపు 10 వేల వైద్యపోస్టుల భర్తీ చేసిందని, గత ప్రభుత్వాలు ప్రభుత్వాసుపత్రులను నిర్వీర్యం చేశాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా ‘‘ప్రభుత్వ ఆస్పత్రులకు అదనపు బలం చేకూరుస్తున్న జగన్ గారి ప్రభుత్వం. ఒకే నోటిఫికేషన్ ద్వారా దాదాపు 10వేల  వైద్యపోస్టుల భర్తీ. గత ప్రభుత్వాలు నియామకాలు చేపట్టకపోవడంతో ప్రభుత్వాసుపత్రులు నిర్వీర్యమయ్యాయి. ఇకపై 24 గంటలూ పూర్తి స్టాఫ్ తో పనిచేస్తాయ్.’’ అంటూ ట్వీట్ చేశారు

You might also like

Leave A Reply

Your email address will not be published.