అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి 90 శాతం హామీలను అమలు చేశారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా పలు వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు గ్యాంగ్ హైదరాబాద్ లో తిష్టవేసి ఏపీలో కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వారు సంక్షేమ పాలనను ఎలా అడ్డుకోవాలా అనే స్కెచ్చులు వేస్తున్నారని ఆరోపించారు.
ఏడాదిలోనే 90 శాతం హామీలు నెరవేర్చి, ఇంకా చేయాల్సిన పనుల గురించి జగన్ గారు తపన పడుతుంటే, బాబు గ్యాంగ్ హైదరాబాద్ లో తిష్ఠవేసి కుట్రలకు తెగబడ్డారు. రాష్ట్ర శ్రేయస్సు అవసరం లేదు. ప్రజలు సంతోషంగా ఉండొద్దు. సంక్షేమ పాలనను ఎలా అడ్డుకోవాలా అని స్కెచ్చులు వేస్తున్నారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 24, 2020