FbTelugu

చర్చనీయాంశంగా విజయ్ రాజకీయ ప్రవేశం

చెన్నై: తమిళ నటుడు విజయ్ రాజకీయ రంగ ప్రవేశంపై తంబీల మధ్య తెగ చర్చ జరగుతోంది. ఆయన త్వరలోనే రాజకీయారంగేట్రం చేస్తారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు.
సీఎం జయలలిత మరణించన తరువాత మొదలు ఇప్పటి వరకు ఆ ప్రచారం కొనసాగుతునే ఉన్నది. వచ్చే ఏడాదిలో తమిళనాడు అసెంబ్లీ కి ఎన్నికలు ఉండడంతో మళ్లీ ఆయన ప్రవేశంపై చర్చ ఊపందుకున్నది.

విజయ్ తండ్రి, దర్శకులు ఎస్ఏ.చంద్రశేఖర్ విజయ్ రాజకీయ ప్రవేశానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారని కథనాలు వస్తున్నాయి. కొద్ది రోజులుగా బీజేపీ విజయ్ ను లక్ష్యంగా చేసుకుని ఐటీ దాడులు, వేధింపులకు దిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ప్రవేశం ఖాయంగా కన్పస్తోందని అభిమానులు చెప్పుకుంటున్నారు. ఢిల్లీకి వెళ్లి పార్టీని రిజిష్టర్ చేస్తున్నారని, న్యాయవాదితో చర్చిస్తున్నారని అంటున్నారు. అయితే ఈ వార్తలపై అవునని, కాదని మాత్రం విజయ్ ఎక్కడా స్పందించకపోవడం విశేషం.

You might also like