FbTelugu

కేసీఆర్ పాలన అరాచకం: విజయశాంతి

హైదరాబాద్: కేసీఆర్ పాలన ఎంత అరాచకంగా ఉందో తాజా పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు.
కరోనా విజృంభిస్తున్న పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న వైద్య సిబ్బంది ఎన్ని అవమానాల పాలవుతున్నారో గాంధీ హాస్పిటల్ నర్సుల ఆందోళన చూస్తే తెలుస్తుందని ఆమె అన్నారు. పోస్టింగులు, సీనియారిటీ, జీతాల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించిన నర్సులకు కేసీఆర్ జవాబు చెప్పలేకపోతున్నారని ఆమె విమర్శించారు.

ఇక ఆర్టీసీ సిబ్బందికి చెల్లించిన జూన్ నెల జీతాల్లోనూ ఆందోళన నెలకొందన్నారు. కోతలు వేసి ఇచ్చిన జీతం డబ్బులతో ఏ విధంగా బతుకీడ్చాలో తెలియక వారు కుమిలిపోయే పరిస్థితి తీసుకొచ్చారన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సీఎం ఎప్పుడు ఫాంహౌస్‌లో ఉంటారో… ఎప్పుడు ప్రగతిభవన్‌లో దర్శనమిస్తారో తెలియని దుస్థితి నెలకొందన్నారు. ఇదేనా మీరు చెప్పిన బంగారు తెలంగాణ అని విజయశాంతి ప్రశ్నించారు. ఇందుకేనా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకుంది అని ఆమె నిలదీశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.