FbTelugu

విశాఖ స్టీల్ కోసం 20న పాదయాత్ర: ఎంపీ వీవీఎస్

విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ..”విశాఖ స్టీల్‌ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర” చేస్తున్నట్లు ప్రకటించిన వైసీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ప్రకటించారు.
జీవీఎంసీ నుంచి.. విశాఖ స్టీల్ వరకు రాజకీయాలకు అతీతంగా పాదయాత్ర ఉంటుందని ఆయన చెప్పారు. ఈనెల 20వ తేదీన ఉదయం 8:30 గంటలు నుంచి సాయంత్రం 5 గంటలు వరకు పాదయాత్ర.. అనంతరం బహిరంగ సభ ఉంటుందన్నారు. ఢిల్లీకి వినపడేలా “విశాఖ స్టీల్‌ ప్లాంట్ పరిరక్షణ పోరాట యాత్ర” ఉంటుందన్నారు. బీజేపీతో రహస్య ప్రేమ కోసం చంద్రబాబు ప్రయత్నాలు…

ప్లాంట్ ప్రైవేటీకరణపై ప్రధానికి చంద్రబాబు ఎందుకు లేఖ రాయలేకపోతున్నారు? అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబులా డ్రామాలు ఆడటం లేదు.. ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నాం. చిత్తశుద్ధితో సీఎం వైఎస్‌ జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని అన్నారు. ప్రైవేటీకరణపై పార్లమెంట్‌లోను, బయటా వ్యతిరేకిస్తున్నాం, పోరాడతామన్నారు. ప్లాంట్ విస్తరించడం వల్ల సంస్థపై రుణ భారం ఎక్కువగా పడింది.. తక్షణం ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు సూచనలు చేస్తూ ముఖ్యమంత్రి ప్రధానికి లేఖ రాశారు. స్టీల్ ప్లాంట్‌పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశాం.. ఇందులో 13 సంఘాలకు చెందిన నాయకులు పాల్గొన్నారు. కార్మిక సంఘాలు కొన్ని ప్రతిపాదనలు చేశాయి. వాటిని ముఖ్యమంత్రి ముందు ఉంచుతామన్నారు. త్వరలో కార్మిక సంఘాల నాయకుల్ని ముఖ్యమంత్రి దగ్గరకు తీసుకువెళ్తాం.. వీలైతే ప్రధాని వద్దకు తీసుకెళ్తామని విజయసాయి రెడ్డి తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.