FbTelugu

విశాఖ లో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ వస్తోంది

విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఏర్పాటు చేస్తున్నామని వైసిపి ఎంపి వి.విజయసాయి రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌కు తగ్గట్టు విశాఖ కేంద్రంగా అభివృద్ధి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు.

ఇవాళ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మురికివాడల రహిత నగరంగా అభివృద్ధి చేయాలన్న సిఎం వైఎస్.జగన్ రెడ్డి ఆలోచన అమలు చేస్తామని చెప్పారు. విశాఖలో భూములు తాకట్టు పెడుతున్నారని దుష్ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఇది ఈ ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన పద్దతి కాదని, కేంద్రం నుంచి నిధులు తీసుకొనేటప్పుడు ఆస్తులు గ్యారెంటిగా చూపిస్తారన్నారు. జెఎన్ఎన్‌యుఆర్ఎం ఇళ్ల మరమ్మతులకు ఒక్కో ఇంటికి పదివేల రూపాయలు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. విశాఖలో మొత్తం ఎనిమిది కన్వెన్షన్ సెంటర్లు నిర్మిస్తామని వెల్లడించారు. ఒక్కో జోన్‌లో పరిధిలో రూ.5 కోట్లు చొప్పున వ్యయం అంచనాలతో కన్వెన్షన్ సెంటర్లు అభివృద్ధి చేస్తామన్నారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ.500 కోట్లతో ప్రణాళిక రూపొందిస్తున్నామని విజయసాయిరెడ్డి వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.