FbTelugu

థర్డ్ వేవ్ తప్పదు… అతలాకుతలమే: కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ తోనే జనం అల్లాడిపోతుంటూ థర్డ్ వేవ్ తో మరింత అతలాకుతలం అవుతుందని కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వయిజర్ కె.విజయరాఘవన్ హెచ్చరించారు.

ఇవాళ కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్ పై కేంద్ర ఆరోగ్య శాఖ నిర్వహించిన సమావేశంలో రాఘవన్ పాల్గొన్నారు. వైరస్ కొత్త వేరియంట్లు చాలా వేగంగా సంక్రమిస్తున్నాయని, వ్యాధి వచ్చిందని తెలుసుకునేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతున్నదన్నారు. కొత్త వేరియంట్లపై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయని, శాస్త్రవేత్తలు అదే పనిగా పరిశోధిస్తున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుతం వేరియంట్లపై వ్యాక్సిన్లు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని అన్నారు. మున్ముందు రోగ నిరోధక వ్యవస్థను బొల్తా కొట్టించేవి, వ్యాధి తీవ్రతను పెంచే లేదా తగ్గించే వేరియంట్లు రాబోతున్నాయని రాఘవన్ ఆందోళన వ్యక్తం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.