FbTelugu

రెండోసారి సీఎం గా విజయన్ ప్రమాణం

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రిగా పినరయ్ విజయన్ వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర రాజధాని తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ విజయన్ చేత ప్రమాణం చేయించారు.

విజయన్ తో పాటు 21 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. విజయన్ తన అల్లుడు పిఏ.మహ్మద్ రియాస్ కు పబ్లిక్ అండ్ టూరిజం శాఖ ను కేటాయించారు. గత క్యాబినెట్ లో మంత్రులుగా పనిచేసిన వారిలో ఎవరికి కూడా ఈసారి పదవులు ఇవ్వలేదు. అందరూ కొత్తవారే ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఫలితాల్లో మొత్తం 140 సీట్లకు గాను 99 సీట్లను ఎల్డిఎఫ్ కైవసం చేసుకున్నది. ప్రతిపక్ష యూడిఎఫ్ 41 స్థానాల్లో విజయం సాధించింది. విజయన్ కుమార్తె వీణా డివైఎఫ్ఐ నేషనల్ ప్రెసిడెంట్ పిఏ.మహ్మద్ రియాస్ న గతేడాది వివాహం చేసుకున్నది. ఇద్దరిదీ ద్వితీయ వివాహం కావడం గమనార్హం. మొన్న జరిగిన ఎన్నికల్లో తొలిసారి రియాస్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.