అమరావతి: 2024 లోనూ చంద్రబాబు అడ్రస్ గల్లంతేనని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడుపై పలు విమర్శలు చేశారు. ఇప్పటివరకు బాబు హైదరాబాద్ లో ఉంటూ.. జూమ్ యాప్ ద్వారా కుట్రలు పన్నుతున్నారని అన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా బిల్లు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని తలపెట్టాడని.. ఇళ్లపట్టాలు ఇవ్వకుండా అడ్డుకోవడం ఇంకెంత దుర్మార్గమని అన్నారు.