FbTelugu

విజయారెడ్డి హత్యకేసు నిందితుడు సురేష్ మృతి ?

Vijaya-Reddys-murder-victim-Suresh-died-in-osmania

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తహశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం కేసులో ప్రధాన నిందితుడు సురేష్ ముదిరాజ్ ఈ రోజు మృతి చెందినట్టు సమాచారం. విజయారెడ్డిని పెట్రోల్ పోసి తగలపెడుతూ… తాను 62 శాతం కాలిపోయి ఉస్మానియాలో చికిత్స పొందుతున్నాడు. కాగా.. ఈ రోజు పరిస్థితి విషమించి మృతి చెందినట్టు తెలిసింది. కాగా దీనిపై ఉస్మానియా ఆస్పత్రి వర్గాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సురేష్ కు చికిత్స చేస్తున్నామని ఉస్మానియా ఆసుపత్రి డాక్టర్లు పేర్కొన్నారు. విజయా రెడ్డిని కాపాడబోయిన డ్రైవర్ మృతి చెందిన సంగతి తెలిసిందే.

You might also like