FbTelugu

ఏపిలో విజయ పాల మంట

లీటర్ కు రూ.2 చొప్పున పెంపు

అమరావతి: విజయ పాల ధరలను పెంచుతున్నట్లు కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ఛైర్మన్‌ చలసాని ఆంజనేయులు తెలిపారు. అన్ని రకాల పాలపై లీటరుకు రూ.2 చొప్పున పెంచినట్లు ఆయన పేర్కొన్నారు.

పాల సేకరణ ధరలు, రవాణా, ప్యాకింగ్‌ సామగ్రి తదితర ఖర్చులు పెరగడంతో ధరల పెంపు అనివార్యమైందని ఆంజనేయులు వివరించారు. అన్ని రకాల పాలపై లీటరుకు రూ.2 చొప్పున పెంచి, పాల పదార్థాల ధరలూ స్వల్పంగా మార్పు చేసినట్లు పేర్కొన్నారు. ఈ ధరలు మే 1వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని తెలిపారు. నెలవారీ పాల కార్డులు కొనుగోలు చేసిన వారికి మే 9వ తేదీ వరకు పాత ధరలు వర్తిస్తాయని ఆంజనేయులు వెల్లడించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.