FbTelugu

ఫైటర్ సినిమా కోసం విజయ్ సిక్స్ ప్యాక్

Vijay-Six-Pack-for-Fighter-Movie

విజయదేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ చిత్రంకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాకి ఫైటర్ అనే టైటిల్ ను కూడా ఖరారు చేసుకున్నారు. టైటిల్ కి తగినట్టుగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు. ఇందుకోసం ఆహార నియమాలు పాటిస్తున్నాననీ, జిమ్ లో గట్టిగానే కసరత్తులు చేస్తున్నాని విజయ్ దేవరకొండ స్వయంగా చెప్పాడు. అర్జున్ రెడ్డిని మించి తన ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారని అన్నాడు. ఇక ఈ ప్రాజెక్టుపై మరింత క్రేజ్ ను పెంచడం కోసం, విజయ్ దేవరకొండ జోడీగా శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ డేట్స్ కోసం పూరి ట్రై చేస్తున్నారు.

You might also like