FbTelugu

కరోనా మెడిసిన్ కోసం ప్రార్థించా: వీవీఎస్

తిరుమల: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, త్వరలో కరోనా కు మెడిసిన్ కనుగొనేలా ఆశీర్వదించమని కోరినట్లు వైసీపీ రాజ్యసభ సభ్యులు వి.విజయ సాయిరెడ్డి తెలిపారు.
తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం విజయసాయి రెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తెలుగు అకాడమీ చైర్మెన్ నందమూరి లక్ష్మి పార్వతి దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం తరువాత విజయ సాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకున్నాను అని తెలిపారు.

ఎందరో ప్రజలు కరోనా మహమ్మారి బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా మంది భక్తులు ఈ వైరస్ కారణంగా శ్రీవారిని దర్శించుకోలేక పోతున్నారు. త్వరలో కరోనా వైరస్ కు మెడిసిన్ కనుగొనేలా ఆశీర్వదించాలని శ్రీవారిని కోరినట్లు తెలిపారు.

You might also like