FbTelugu

‘వాళ్లు కొక్కొరోకో అంటే తెల్లారే రోజులు పోయాయి’

అమరావతి: వాళ్లు కొక్కొరోకో అంటే తెల్లారే రోజులు పోయాయంటూ వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకొని ఆయన ట్విట్టర్ లో పలు విమర్శలు చేశారు.
‘‘పార్క్ హయత్ భేటీ వార్తలను ఎల్లో మీడియా తొక్కిపెట్టింది.

అంతగా పట్టించుకోదగిన ఘటన కాదని ప్రజల కళ్లకు గంతలు కట్టాలని చూసింది. వాళ్లు ‘కొక్కొరోక్కో’ అంటేనే తెల్లారే రోజులు పోయాయి. తెలుగు రాష్ట్రాల్లోని 9 కోట్ల మంది ఆ ముగ్గురి రహస్య కలయికను చూసారు. సోషల్ మీడియా ఊరుకోదు కదా.’’ అంటూ ట్వీట్ చేశారు.

You might also like