అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో నలు చెరుగులా ఏలిన టీడీపీ పార్టీని 4 గ్రామాలకు పరిమితం చేశాడని, చరిత్రలో చిరిగిన కాగితం చంద్రబాబు నాయుడని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు కురిపించారు.
ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా టీడీపీ నేతలపై ట్వీట్ల వర్షం కురింపించారు. ఇక చంద్రబాబుకు భవిష్యత్తు, వర్తమానం రెండూ లేవని అన్నారు. టీడీపీ నేత వర్ల రామయ్య మాట్లాడితే దళిత నాయకుడినంటూ.. అంబేద్కర్ స్మృతి వనాన్ని జగన్ ప్రభుత్వం కట్టాలని ప్రతిపాదిస్తే ఎలా కడతారని ప్రశ్నిస్తావని అన్నారు.
చరిత్ర పుస్తకంలో చిరిగిన కాగితం చంద్రబాబు. వర్తమానం లేదు. భవిష్యత్తు లేదు. తనపై తనే నమ్మకం కోల్పోయిన వ్యక్తి పార్టీ శ్రేణులకు ఏం ధైర్యం ఇవ్వగలడు. తప్పులను సవరించుకునే బదులు ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఉమ్మడి రాష్ట్రం నలుచెరుగులా ఏలిన పార్టీని నాలుగు గ్రామాలకు పరిమితం చేశాడు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 11, 2020