FbTelugu

టైమ్స్ జాబితాలో విజయ్ దేవరకొండ

నోటా, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాలు ఘోర పరాజయం పాలైనా విజయ్ దేవరకొండ ప్రాభవం ఏమాత్రం తగ్గలేదు. ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా ఆన్ లైన్ లో నిర్వహించిన మోస్ డిజైరబుల్ మెన్ ఇన్ ఇండియాలో చోటు దక్కించుకున్నాడు.
టాలీవుడ్ మరే హీరో ఈ అవకాశాన్ని పొందలేకపోయారు. ఆన్ లైన్ పోటీలో 40 ఏళ్ల లోపు ఉన్నవారి పేర్లను సూచించి, ఓటింగ్ నిర్వహించింది. ఈ జాబితాలో ప్రభాస్, రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవర కొండ పేర్లు ఉన్నాయి. సౌత్ ఇండియా నటులు నవీన్ పౌలి, దుల్కర్ సల్మాన్ పేర్లను కూడా చేర్చారు. క్రీడల్లో విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్.రాహుల్ పేర్లను పొందుపర్చారు.

పోటీలో బాలీవుడ్ హీరోలు షాహిద్ కపూర్ తొలిస్థానంలో, రణవీర్ సింగ్ ద్వీతీయ స్థానంలో నిలిచారు. మూడో స్థానం విజయ్ దేవరకొండ దక్కించుకున్నారు. విజయ్ కు తప్ప మరే హీరోకు టాప్ టెన్ లో చోటు దక్కలేదు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైటర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

You might also like