FbTelugu

ప్రైవేట్ హస్పిటల్స్ పై విజిలెన్స్ దాడులు

అమరావతి: అక్రమాలకు పాల్పడుతూ రోగులను జలగల్లా పీడిస్తున్న ప్రైవేటు హాస్పిటల్స్ పై విజిలెన్స్ దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 37 ప్రైవేటు హస్పిటల్స్ పై అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించి  కేసులు నమోదు చేశారు.

ఏలూరు చైత్ర హస్పటల్ లో  అనుమతి లేకుండా కరోనా వైద్యం, అధిక ధరల వసూలు చేస్తున్నట్లుగా గుర్తించారు. రోగుల విషయంలో తప్పుడు సమాచారం ఇవ్వడంతో క్రిమినల్  కేసు నమోదు చేశారు. గుంటూరు విశ్వాస్ హాస్పిటల్ పై ఆరోగ్య శ్రీ వైద్యం చేయనందుకు, అధిక ధరలు వసూళ్ళ  చేస్తున్నట్లు గమనించారు. పీలేరు ప్రసాద్ హాస్పిటల్ పై కూడా దాడులు నిర్వహించారు. వైజాగ్ లోని ఎస్ఆర్ హస్పటల్, అనిల్ నిరుకొండ, రమ్య హాస్పిటల్ లో అదిక ధరలు వసూలు చేయడం , రెమిడిస్విర్  దుర్వినియోగం జరిగినట్టు గుర్తించారు. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రికార్డులు జప్తు చేశారు.

విజయవాడ శ్రీరామ్ హాస్పిటల్ లో అనుమతి లేకుండా కరోనా వైద్యం చేస్తూ, అధిక ధరలు వసూలు చేస్తున్నట్లుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. అచ్యుతా ఎన్ క్లేవ్ లో అక్రమంగా వైద్యం చేస్తున్న హాస్పిటల్ పై కూడా విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.