FbTelugu

విజ‌య‌సాయిపై నిఘా ఉంచిందెవ‌రూ!

ఏపీలో జ‌గ‌న్ త‌రువాత ఎవ‌రంటే.. వెంట‌నే వినిపించే పేరు విజ‌య‌సాయిరెడ్డి. ఎన్నిక‌ల్లో.. పాల‌నా వ్య‌వ‌హారాల్లోనూ విజ‌య‌సాయిదే కీల‌క భాగ‌స్వామ్యం అనేంత ముద్ర‌ప‌డిపోయింది.

వైసీపీ గెలిచాక మంత్రివ‌ర్గంలో చోటుకోసం ఎంతోమంది ఎమ్మెల్యేలు ఆయ‌న వ‌ద్ద‌కు క్యూ క‌ట్టారట‌. ఆయ‌న్ను ప్ర‌స‌న్నం చేసుకోవ‌టం ద్వారా మంత్రి కావ‌చ్చ‌నే ధీమా ఉండేద‌ట‌. ఒక‌మాట చెప్పాలంటే.. జ‌గ‌న్‌ను ఎవ‌రు క‌ల‌వాల‌న్నా.. ఏ నిర్ణ‌యం తీసుకోవాల‌న్నా విజ‌య‌సాయిరెడ్డి ప‌చ్చ‌జెండా ఊపాల్సిందేన‌ట‌. అంత‌టి కీల‌క‌మైన నాయ‌కుడు విశాఖ నాదేనంటూ తెగేసి చెప్పినా జ‌గ‌న్ ఏమీ అన‌లేక‌పోయాడు.

ట్వీట్ల‌తో తిట్ల‌పురాణానికి స‌రికొత్త అర్ధాలు వెతుకుతున్న ఆయ‌న‌కూ ఈ మ‌ధ్య కోపం వ‌చ్చింది. త‌న‌పై అవాకుల చ‌వాకులు పోతూ.. సోష‌ల్ మీడియాలో చెల‌రేగే వారిని సైబ‌ర్‌క్రైమ్ పోలీసుల‌తో అరెస్ట్ చేయిస్తానంటూ ప్ర‌తినబూనారు. అటువంటి నేత ఈ మ‌ధ్య విశాఖ ప‌రామ‌ర్శ‌ల‌కు వెళ్లేందుకు బ‌య‌ల్దేరితే… ఫాఫం జ‌గ‌న్ కాన్వాయ్‌లో చోటు కూడా దొర‌క‌లేదు. దీనిపై ఆ త‌రువాత మంత్రులు వివ‌ర‌ణ ఇచ్చినా.. దానిపై అనుమానాలు మాత్రం అలాగే కొన‌సాగుతుంటాయి. అయితే.. ప్ర‌తిచోట ఇలా వేలు.కాలు పెడుతూ ప్ర‌భుత్వం అంటే తానే అనేంత‌గా చెల‌రేగ‌టం పార్టీపై ప్ర‌భావం చూపుతుంద‌నే భావ‌న సీనియ‌ర్ల‌లో ఉన్న‌ట్టుంది.

అందుకే.. విజ‌య‌సాయి కార్య‌క‌లాపాలు.. స‌మావేశాలు.. ఆయ‌న ప‌క్క‌న కోట‌రీగా చేరుతున్న నేత‌ల గ‌ణంపై కూడా నిఘా ఉంద‌టం. పైగా.. ఆయ‌న మ‌నుషులు అనుకున్న చోట‌.. ప్ర‌భుత్వం త‌ర‌పున మ‌రో యంత్రాంగం కూడా ఓ లుక్కేసింద‌ట‌. ఏమైనా విజ‌య‌సాయి ఇది ఊహించ‌ని షాక్‌.. ఆయ‌న‌ను వ్య‌తిరేకించే వారికి కిక్‌.

You might also like