FbTelugu

విద్యాబాలనే నన్ను డిన్నర్ కు పిలిచింది: మంత్రి షా

భోపాల్: నటీమణి విద్యాబాలన్ ను తను డిన్నర్ కు పిలువలేదని, ఆమె తనను ఆహ్వానిస్తే వీలుపడక వెళ్లలేదని మధ్యప్రదేశ్ అటవీ శాఖ మంత్రి విజయ్ షా స్పష్టం చేశారు.

షేర్ని షూటింగ్ కోసం మధ్యప్రదేశ్ వచ్చిన నటీమణి విద్యాబాలన్ ను మంత్రి విజయ్ షా డిన్నర్ కు ఆహ్వానిస్తే నిరాకరించారని, అది మనసులో పెట్టుకున్న మంత్రి షూటింగ్ కు అనుమతిత్వకుండా ఇబ్బందులు పెట్టారని వార్తలొచ్చాయి. ఈ వార్తలపై విజయ్ షా స్పందించారు.

సినిమా షూటింగ్ కోసం ముందుగానే అనుమతి తీసుకున్నారు. అటవీ ప్రాంతంలో డిన్నర్ కు రావాల్సిందిగా చిత్ర యూనిట్ ఆహ్వానించగా వీలుకాక వెళ్లలేదన్నారు. మహారాష్ట్రకు వచ్చినప్పుడు కలుస్తానని చెప్పానని, దీంతో డిన్నర్ ఏర్పాట్లు ఆగిపోయాయన్నారు. అంతే తప్ప సినిమా షూటింగ్ ఎక్కడా ఆగిపోలేదని ఆయన వెల్లడించారు. అటవీ శాఖ అధికారులు షూటింగ్ ఆపారనేది అవాస్తవమని మంత్రి విజయ్ షా తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.