FbTelugu

కళ్లెదుటే మనిషి దగ్ధం… వీడియో షూటింగ్

Videos-if-a-man-is-blindfolded-in-rajasthan

జైపూర్: కళ్లెదుటే ఓ మనిషి అగ్నికి ఆహుతైపోతుంటో కనీసం గోరంతైనా సాయం చేద్దామనే ఆలోచనే రాకపోగా మొబైల్‌ ఫోన్‌లతో ఆ దృశ్యాన్ని చిత్రీకరిస్తూ గడిపేసిన ఘటన రాజస్థాన్ లో చోటుచేసుకుంది. సాయంకోసం బాధితుడు చేసిన ఆక్రందనలు ఏ గుండెనూ కరిగించలేదు. దీంతో చివరకు అగ్నికి ఆహుతైపోయారు. వివరాల్లోకెళితే.. ప్రేమ్‌చంద్‌జైన్‌(53)అనే వ్యాపారి బుధవారం ఉదయం ఫ్యాక్టరీకి వెళుతుండగా 10.25 ప్రాంతంలో కోట-ఉదయ్‌పుర్‌ జాతీయ రహదారిపై ధక్కడ్‌ఖేడి గ్రామ సమీపంలో ఆయన కారు ఆగిపోయింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కారు సెంట్రల్‌ లాక్‌ వ్యవస్థ పనిచేయలేదు. వెలుపలికి రావడానికి వీల్లేని పరిస్థితుల్లో అతడు ఆర్తనాదాలు చేస్తుంటే చుట్టుపక్కల జనం కనీసం స్పందించలేదు. ఆయన నిస్సహాయ స్థితిని మొబైల్‌ఫోన్లలో చిత్రీకరిస్తూ ఉండిపోయారు. ఆ వీడియోలు ఎవరికోసమో.. వారికే తెలియాలి. వారు సకాలంలో స్పందించి కారు అద్దాలు పగలగొట్టి ఉంటే ప్రాణాలతో బయటపడేవాడని పోలీసులు చెప్పారు.

You might also like