FbTelugu

వీడియో తీసి లైంగిక వేధింపులు… చివరకు పరారీ

లక్నో: గోరఖ్ పూర్ లోని ఆర్ఎం పబ్లిక్ స్కూలు కరస్పాండెంట్ హరేంద్ర యాదవ్ (38) తన స్కూలులోనే చదవుతున్న 7వ తరగతి బాలికపై కన్నేశాడు. తరగతి గదికి పిలిపించి లైంగికంగా వేధించి, ఆపై వీడియోలు తీశాడు.
ఇక ఆ తరువాత ప్రతి రోజు స్కూలుకు రావాలని చెప్పేవాడు. తను ఫోన్ చేసినప్పుడల్లా రావాలని, లేదంటే వీడియో సోషల్ మీడియాలో పెడతానని బెదించాడు.

తను పిలిచినప్పుడల్లా వచ్చి కోరిక తీర్చాలని నెల రోజుల పాటు బెదిరించాడు. ఆగడాలు ఎక్కువ కావడంతో బాలిక జరిగిన విషయాన్ని తండ్రికి వివరించింది. బాలికను వెంట తీసుకుని పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.
పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో బాధితురాలు జిల్లా ఎస్పీని కలిసి వివరించింది. ఎస్పీ ఆదేశం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.

You might also like