FbTelugu

విక్టరీ వెంకటేష్ దృశ్యం 2 తెలుగు సినిమా జెన్యూన్ రివ్యూ |

victory venkatesh
victory venkateshచిత్రం: దృశ్యం2; నటీనటులు: వెంకటేశ్‌, మీనా, కృతిక, ఏస్తర్‌ అనిల్‌, సంపత్‌ రాజ్‌, నదియా, నరేశ్‌, పూర్ణ, తనికెళ్ల భరణి, సత్యం రాజేశ్‌, షఫీ తదితరులు; సంగీతం: అనూప్‌ రూబెన్స్‌; సినిమాటోగ్రఫీ: సతీష్‌ కురుప్; ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె వెంకటేశ్‌; ప్రొడక్షన్‌: సురేశ్‌ ప్రొడక్షన్స్‌, ఆశీర్వాద్‌ సినిమాస్‌; నిర్మాత: డి.సురేశ్‌బాబు, ఆంటోనీ పెరంబవూర్‌, రాజ్‌కుమార్‌ సేతుపతి; రచన, దర్శకత్వం: జీతూ జోసెఫ్‌; విడుదల: అమెజాన్‌ ప్రైమ్‌
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న అగ్ర కథానాయకుల్లో వెంకటేశ్‌ శైలి కాస్త భిన్నమైంది. గత కొంతకాలంగా ఆయన ఎంచుకుంటున్న కథలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. కమర్షియల్‌ అంశాల జోలికి పోకుండా కథకు ప్రాధాన్యం ఇస్తూ అవసరమైతే ఇద్దరు పిల్లల తండ్రిగా, గురువుగా నటించడానికి సిద్ధంగా ఉంటారు. పైగా రీమేక్‌ కథలను రక్తికట్టించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే వెంకటేశ్‌ సినిమాల సక్సెస్‌ రేటు ఎక్కువ. ఆయన కీలక పాత్రలో 2014లో వచ్చిన సూపర్‌హిట్‌ ఫిల్మ్‌ ‘దృశ్యం’. థ్రిల్లర్‌ మూవీగా ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మలయాళ రీమేక్‌ అయినా, వెంకటేశ్‌ తనదైన శైలిలో నటించి మెప్పించారు. ఇప్పుడు దానికి కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రం ‘దృశ్యం2’ . ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఓటీటీ బాటపట్టింది. మరి రాంబాబుగా వెంకటేశ్‌ తన కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం ఏం చేశాడు? ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు తెలియాలంటే ‘దృశ్యం2’ చూడాల్సిందే!
You might also like

Leave A Reply

Your email address will not be published.