FbTelugu

మీడియాపై ఉపరాష్ట్రపతి ప్రశంసల జల్లు

న్యూఢిల్లీ: కష్టకాలంలోనూ ముందుండి సేవలందించిన మీడియా రంగంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మీడియా ప్రజలకు నిత్యం సమాచారం అందించి, ఏ విషయంలోనూ రాజీ పడలేదని కితాబిచ్చారు. దేశంలో కరోనా నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురికాకుండా చూసుకోవాలని పిలుపునిచ్చారు. కరోనా మహమ్మారి అంశం పార్లమెంటులో పరిశీలనలో ఉందని తెలిపారు.

You might also like