FbTelugu

అంబేద్కర్ విగ్రహం కోసం విహెచ్ ఆమరణ దీక్ష

హైదరాబాద్: కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు తన ఇంటి వద్ద ఆమరణ నిరాహార దీక్ష కు దిగారు. పంజగుట్ట చౌరస్తాలో రాజశేఖర రెడ్డి విగ్రహం తొలగించి అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అయ్యే వరకు దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా వి.హనుమంతరావు మాట్లాడుతూ, 2019 ఏప్రిల్ 12 న పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహం పెట్టించానన్నారు. ఏప్రిల్ 13 న అంబేద్కర్ విగ్రహం కూల్చివేయించారు. ఏపీలోని అమలాపురం వెళ్లి రూ.5 లక్షలు పెట్టి విగ్రహం తెప్పించి, కూలగొట్టి దాన్ని గోషామహల్ స్టేడియంలో పెట్టారని ఆయన ఆరోపించారు. రాజ్యాంగం రాసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ బొమ్మను పోలీస్ స్టేషన్ లో పెడతారా అని నిలదీశారు. దీనిపై టిఆర్ఎస్ ప్రభుత్వం లో ఉన్న ఏ ఒక్కరు మాట్లాడటం లేదన్నారు. వైఎస్.షర్మిల రాజన్న రాజ్యం అంటున్నది, ఆయన రాజ్యం ఎక్కడిది.. సొంతంగా స్థాపించాడా అని మండ…

You might also like

Leave A Reply

Your email address will not be published.