FbTelugu

వెంటిలేటర్ పీకేశారు…. చచ్చిపోతున్నా డాడీ…

హైదరాబాద్: కరోనా పాజిటివ్ సోకిన ఒక యువకుడు చావుబతుకుల మధ్య పంపిన సెల్ఫీ వీడియో వైరల్ గా మారింది.

ఊపిరి ఆడటం లేదు డాడీ, వెంటిలేటర్ పెట్టాలని మూడు గంటలుగా కోరుతున్న ఛెస్ట్ హాస్పిటల్ డాక్టర్లు స్పందించడం లేదంటూ రవికుమార్ అనే వ్యక్తి తన తండ్రికి వీడియో పంపించాడు. ఉపిరి అందడం లేదు… చచ్చిపోతున్నానని అంటూ చెప్పాడు. బై డాడీ అంటూ పంపిన వీడియో వైరల్ అయ్యింది.

మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కు చెందిన రవికుమార్ అనే యువకుడికి కరోనా పాజిటివ్ సోకింది. అతన్ని ఎర్రగడ్డలోని ఛెస్ట్ హాస్పిటల్ లో చేర్పించారు. ఆరోగ్యం మెరుగుపడిందంటూ వెంటిలేటర్ తీసివేశారు. దీంతో రవికి ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారింది. ఊపిరితీసుకోలేకపోతున్నానని, మళ్లీ వెంటిలేటర్ పెట్టాలని డాక్టర్లను వేడుకున్నాడు. అయినా పెట్టకపోవడంతో ఇక బతకలేనని నిర్థారించుకున్నాడు.

చనిపోవడం ఖాయమని అర్థం కావడంతో సెల్ఫీ వీడియో తీసి తండ్రికి పంపించాడు. మూడు గంటల పాటు నరకయాతన అనుభవించి చివరకు ప్రాణాలలు విడిచాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.