FbTelugu

సరిహద్దులో కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు

విజయవాడ: తెలంగాణ, ఏపీ సరిహద్దులో జాతీయ రహదారి 65 పై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రాష్ట్ర సరిహద్దులో చెక్ పోస్టు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

కరోనా నేపథ్యంలో పాస్ లు ఉన్న వాహనాలను మాత్రమే ఏపీలోకి పోలీసులు అనుమతిస్తున్నారు. ఈ తరుణంలో గరికపాడు చెక్ పోస్ట్ దగ్గర భారీ సంఖ్యలో పాస్ లేని వాహనాలు నిలిచిపోయాయి.

You might also like