FbTelugu

నో రిపోర్టు… క్యూ కట్టిన కార్లు

సిమ్లా: కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండడంతో పర్యాటక ప్రాంతమైన హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. నిర్ణయం ప్రకటించిందో లేదో గంటల వ్యవధిలో రాష్ట్ర సరిహద్దులు కార్లతో నిండిపోయాయి.

వేలాది వాహనాలు రాష్ట్ర సరిహద్దులో క్యూ కట్టాయి. 36 గంటల వ్యవధిలో సుమారు 5వేల కు పైగా వాహనాలు సిమ్లకు చేరుకున్నాయి. పెద్ద ఎత్తున వాహనాలు రావడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హిమాచల్ ప్రదేశ్ సందర్శించేవారు ఆర్.టి.పి.సి.ఆర్ రిపోర్టు తీసుకురావాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. ఇంకేముంది ఇది చూసిన పలువురు పర్యాటకులు ప్రకృతి అందాలను వీక్షించేందుకు తమ వాహనాల్లో బయలుదేరారు. భౌతిక దూరం, మాస్క్ లు ధరించాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పోలీసులు మైకుల ద్వారా హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాత్రిపూట మాత్రమే కర్ఫ్యూ అమల్లో ఉంది.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.