FbTelugu

ఔటర్ రింగ్ రోడ్డుపై వాహనాలకు అనుమతి

హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్)పై నేటి అర్థరాత్రి నుంచి వాహనాలు వెళ్లుటకు అధికారులు అనుమతించారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా గత కొన్ని కొంత కాలంగా ఈ రోడ్డుపై వాహనాల రాకపోకలకు నిషేధం విధించారు.

కేవలం అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతించారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పలు వాహనాలకు సడలింపులు ఇవ్వడంతో ఔటర్ రింగ్ రోడ్డుపై అన్ని వాహనాలకు అనుమతించారు. అయితే రాత్రి 7:00 నుంచి ఉదయం 7:00 వరకు వాహనాలకు అనుమతి లేదు. ఓఆర్ఆర్ టోల్ ప్లాజాల వద్ద ఫాస్టాగ్ నిబంధనలు పాటించాలని సూచించారు. అదేవిధంగా డిజిటల్ పేమెంట్లకు ప్రాధాన్యం ఇవ్వాలని హెచ్ఎండీఏ సూచించింది.

You might also like