FbTelugu

ఇకనుంచి వాహనాల జప్తు

హైదరాబాద్ ట్రాఫిక్‌ పోలీసుల నిర్ణయం

హైదరాబాద్: ఏదో ఒక కారణం చూపి బయటకు వస్తున్న వారి వాహనాలను జప్తు చేయాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిర్ణయించారు.

లాక్ డౌన్ ఎత్తేసిన తరువాతే వాహనాలను తిరిగి యజమానులకు అప్పగించనున్నారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పోలీసులు ప్రకటించారు.

వైద్య సంబంధ, అత్యవసర కారణాలు మినహా చిన్న, చిన్న కారణాలు చెబుతూ రోడ్లపైకి వచ్చే వారిపై గురువారం నుంచి పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు. వాహనదారులు ఇష్టారాజ్యంగా రోడ్లపైకి వస్తుండడంతో మంగళవారం వరకూ హెచ్చరికలతో సరిపెట్టిన పోలీసులు తాజాగా కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఎస్సార్‌నగర్‌, ఎర్రగడ్డ, అమీర్‌పేట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట, పాతబస్తీ ప్రాంతాల్లో మంగళవారం వందల సంఖ్యలో వాహనాలు రోడ్లపైకి వచ్చాయి. ఈ అంశాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణించారు.

 

You might also like