FbTelugu

అంబులెన్స్ ను ఢీకొన్న వాహనం.. ఇద్దరు మృతి

కృష్ణా: అంబులెన్స్ ను ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన జిల్లాలోని గన్నవరం దగ్గర చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గన్నవరం దగ్గర ఓ గుర్తు తెలియని వాహనం అంబులెన్స్ ను బలంగా ఢీకొట్టింది.

ఈ ఘటనలో భాస్కరభట్ల శ్రీనివాసశాస్త్రి, రవిశంకర్ శాస్త్రి అనే ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.