FbTelugu

ఆ యువతికి న్యాయం జరుతుంది: వాసిరెడ్డి పద్మ

గుంటూరు: ఇంజనీరింగ్ విద్యార్థులు తోటి విద్యార్థిని నగ్నవీడియోలు తీసి నెట్ లో పెట్టిన కేసులో పోలీసులు దోషులని అదుపులోకి తీసుకొని యువతికి న్యాయం చేస్తారని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు.

యువతి నగ్న వీడియోలు తీసి నెట్లో పెట్టి వేధింపులకు పాల్పడిన ఘటనపై ఇవాళ ఆమె గుంటూరు అర్భన్ ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఈ కేసుపై ఆరా తీశారు. కేసు వివరాలను ఎస్పీని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ విద్యార్థులు కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి తోటి విద్యార్థినికి తాగించి నగ్నవీడియోలు తీయడం చాలా బాధాకరం అన్నారు. ఐపీ అడ్రెస్ దొరకగానే ఆ మూడో వ్యక్తిని కూడా పోలీసులు పట్టుకుంటారని అన్నారు. యువతికి న్యాయం జరుగుతుందని అన్నారు.

You might also like