FbTelugu

చట్టానికి ఎవరూ అతీతులు కాదు: వాసిరెడ్డి పద్మ

అమరావతి: చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలను దూషించిన టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు నిర్భయ చట్టం నుంచి తప్పించుకోలేరని అన్నారు.

మహిళలను కించపరిచే నేతలకు అయ్యన్న పాత్రుడి కేసు గుణపాఠం కావాలని అన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను మహిళాలోకం సహించదని అన్నారు. త్వరలోనే అయ్యన్న పాత్రుడిని అరెస్టు చేస్తామని ఎస్పీ చెప్పినట్టు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.