FbTelugu

ఎన్టీఆర్, ఏఎన్ఆర్ పై వర్మ ట్వీట్లు

హైదరాబాద్: మువీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. నటుడు ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అంటూ చేస్తున్న విమర్శలపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్లు చేశారు.

కృష్ణా జిల్లా నుంచి పొట్ట చేతబట్టుకుని చెన్నై వెళ్లిన ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావులు ఎలా నాన్ లోకల్ అవుతారని వర్మ ప్రశ్నించారు. కర్ణాటక నుంచి ఏపి వచ్చిన ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అయితే, కృష్ణా నుంచి వెళ్లిన ఎన్టీఆర్, నాగేశ్వర రావు, గుంటూరు నుంచి వెళ్లిన కృష్ణ, చిత్తూరు నుంచి వచ్చిన మోహన్ బు నాన్ లోకలా? అన్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన రజనీకాంత్, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చిన అమితాబ్ బచ్చన్ కూడా నాన్ లోకలా అని వర్మ నిలదీశారు. మూడు దశాబ్ధాలుగా ఇక్కడే ఉండి తెలుగు నేర్చుకుని, చలం పుస్తకాలను ముద్రించి భార్యాపిల్లలతో ఇక్కడే ఉంటున్నారు. తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడున్న ఎంతో మంది మహిళలకు పనికల్పిస్తున్న ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ ఎలా అవుతారన్నారు.
ప్రకాశ్ రాజ్ ప్రతిభను గుర్తించి కేంద్రం నాలుగుసార్లు అవార్డుతో సత్కరిస్తే ఇదేనా మనమిచ్చే గౌరవమన్నారు. సినీ పరిశ్రమలో కూడా లోకల్, నాన్ లోకల్ విమర్శలపై వర్మ ఘాటుగా స్పందించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.